![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-303 లో. . స్టోర్ రూమ్ లో ఉన్న కృష్ణకి మురారి హెల్ప్ చేస్తుంటాడు. మరొకవైపు భవాని దగ్గరికి ప్రసాద్ వచ్చి మాట్లాడతాడు. అన్నయ్య దగ్గరికి మన పవర్ స్టేషన్ ప్రాజెక్టు గురించి వెళ్లి వచ్చానని అంటాడు. మురారీ గురించి ఈశ్వర్ ఏమన్నాడని భవాని అడుగగా.. ప్రాణాలతో ఉన్నాడు. అదే చాలని అన్నాడు. ఫస్ట్ ఈ వార్త విని రెండు రోజులు భోజనం చేయలేదంట. కానీ ఒక మాట అన్నాడు వదిన.. నాకు అది నచ్చలేదని ప్రసాద్ అంటాడు. ఏంటది అని భవాని అడుగగా.. ముకుంద, మురారీల పెళ్ళి చేస్తే బాగుంటుందని చెప్పాడని భవానీతో ప్రసాద్ అంటాడు. ఇక భవానీ ఆలోచిస్తుంటుంది. సారీ వదిన అని ప్రసాద్ అనగా.. ఇందులో సారీ చెప్పడానికి ఏం ఉంది ప్రసాద్, తన అభిప్రాయం తను చెప్పాడని అంటుంది. ఆదర్శ్ వచ్చాక ఇవన్నీ తెలుసుకొని ఈ ఇంట్లో ఉంటాడంటావా ప్రసాద్ అని భవాని అనగా.. మీరు చెప్తే ఉంటాడేమోనని ప్రసాద్ అంటాడు.
మరొకవైపు స్టోర్ రూమ్ లో ఉన్న ముకుంద, మురారీలు అంతా క్లీన్ చేస్తారు. నీ పేరేంటని మురారి అడుగాగ.. నా పేరు వేణి అని పిలవమని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఫ్రెష్ అయి తులసి కోటకి పూజ చేస్తుంది కృష్ణ. అది బిల్డింగ్ పైన ఉండి చూస్తాడు. ఇక హారతి తీసుకోవడానికి మురారి పరుగెత్తుకుంటూ రావడంతో కాలు స్కిడ్ అవుతుంది. ఇక కృష్ణ హారతి తీసుకొని పరుగెత్తుకుంటూ వస్తుంది. అందరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత మురారిని తన గదిలోకి తీసుకెళ్ళమని భవాని అంటుంది. ఏం చదివావని కృష్ణని భవాని అడుగుతుంది.. మా ఏసీపీ సర్ ఎంబీఏ చదివించాడని కృష్ణ చెప్తుండగా.. నోర్ మూసేయ్ ఇంకోసారి ఏసీపీ సర్ అన్నావీ మర్యాదగా ఉండదని అంటుంది. సంస్కారం, సిగ్గు, శరం, రోషం ఇవేమీ లేవా? వద్దన్నా ఇంకడెందుకుంటున్నావ్? మురారిని ఇంకా ఏం చేద్దామని వచ్చావని కృష్ణని భవాని అడుగుతుంది.
నిజం ఎప్పుడు అబద్ధం కంటే నమ్మకంగా ఉంటుంది . అందుకే అందరు అబద్దాన్నే నమ్ముతారని భవానితో కృష్ణ అనగానే.. తెలివిగా మాట్లాడుతున్నాని అనుకుంటున్నావా అని భవాని అంటుంది. లేదు అత్తయ్య తెలుసుకొని మాట్లాడుతున్నానని కృష్ణ అనగానే.. ఇంకడి నుండి వెళ్ళిపోమని రేవతిని చెప్పమంటుంది భవాని. ఏసీపీ సర్ ని జీవితాంతం భ్రమలోనే ఉంచుతారా? నెమ్మదిగా గతం గుర్తుకుచేద్దామని కృష్ణ అనగానే.. చేద్దాం, అది నువ్వు ముందు దూరమైనప్పుడుణ వాడు నిన్ను పూర్తిగా మర్చిపోయినప్పుడు తప్పకుండా గుర్తుచేస్తానని, నాకు సలహాలిస్తే అవుటవుజ్ లో కూడా ఉండవని కృష్ణతో భవాని అంటుంది.
మరొకవైపు కృష్ణ గదిలోని ఫోటోలని, వస్తువులని అన్నింటికి ఒక బ్యాగ్ లో వేస్తుంది ముకుంద. ఇక కిచెన్ లో ఉన్న రేవతి.. ఎందుకు కృష్ణని భవాని అక్క నమ్మడం లేదని రేవతి అనుకుంటుంది. మరొకవైపు లోహపు కృష్ణుడి విగ్రహాన్ని చూసిన మురారికి గతం గుర్తుకొస్తుంటుంది. ఇక తలపట్టుకొని మురారి బాధపడుతుండగా అందరు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |